Laxman Jagtap | మహారాష్ట్రలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యే లక్ష్మణ్ జగ్తప్ (59) మంగళవారం ఉదయం మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బేనర్ (Baner) లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. క్యాన్సర్తో బాధపడుతున్న లక్ష్మణ్.. చాలా కాలంగా చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పారు.
లక్ష్మణ్ అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం 7గంటలకు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం లక్ష్మణ్.. మహారాష్ట్రలోని పింపి చిచ్వాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. నియోజకవర్గ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.