కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో ప్రతిపక్ష బీజేపీ నుంచి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు బీజేపీకి గుడ్‌బై చెప్పి తృణమూల్ కాంగ్రెస్‌కు జైకొట్టగా.. తాజాగా మరో ఎమ్మెల్యే అదేబాట పట్టారు. ఇటీవల భారతీయ జనతాపార్టీకి చెందిన ఎమ్మెల్యే కృష్ణ కళ్యాణి.. ఇవాళ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. కోల్‌కతాలో రాష్ట్ర మంత్రి పార్థ చటర్జి సమక్షంలో ఆయన తృణమూల్ తీర్థం పుచ్చుకున్నారు.
బెంగాల్లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఆ రెండు పార్టీలు చివరి దశ వరకు నువ్వా నేనా అన్నట్లు పోటీపడ్డాయి. చివరికి ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారం చేపట్టింది. దాంతో బీజేపీ తరఫున గెలిచిన చాలా మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నారు.
West Bengal: BJP MLA Krishna Kalyani, who resigned from the party earlier this month, joins Trinamool Congress in presence of State Minister Partha Chatterjee in Kolkata pic.twitter.com/smPsX7gMs4
— ANI (@ANI) October 27, 2021