Home
National
Bjp May Open Account In Kerala Congress Led Udf Likely To Bag 17 18 Seats Axis My India Exit Poll
కేరళలో ఖాతాతెరవనున్న బీజేపీ?
కేరళలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఆసక్తికర అంచనాలు వెలువరించాయి. కేరళలో ఈసారి బీజేపీ ఖాతా తెరిచే అవకాశం ఉందని మెజారిటీ సంస్థలు పేర్కొన్నాయి. కమలం పార్టీకి ఇక్కడ ఒకటి నుంచి మూడు లోక్‌సభ స్థానాలు దక్కవచ్చని పేర్కొన్నాయి.
తిరువనంతపురం, జూన్ 1: కేరళలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఆసక్తికర అంచనాలు వెలువరించాయి. కేరళలో ఈసారి బీజేపీ ఖాతా తెరిచే అవకాశం ఉందని మెజారిటీ సంస్థలు పేర్కొన్నాయి. కమలం పార్టీకి ఇక్కడ ఒకటి నుంచి మూడు లోక్‌సభ స్థానాలు దక్కవచ్చని పేర్కొన్నాయి. తిరువనంతపురం నియోజకవర్గంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ శశి థరూర్‌ను బీజేపీ అభ్యర్థి, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఓడించవచ్చని ఇండియా టుడే – యాక్సిస్ మే ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. త్రిస్సూర్‌లో బీజేపీ అభ్యర్థి, నటుడు సురేశ్ గోపి గెలవొచ్చని టైమ్స్ నౌ జోస్యం చెప్పింది. తమిళనాడులో బీజేపీకి ఒకటి నుంచి మూడు స్థానాలు దక్కవచ్చని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అంచనా వేశాయి. తమిళనాడు, కేరళలో విస్తరించాలని, కొన్ని సీట్లయినా గెలుచుకోవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

