లక్నో: భార్య, పిల్లలపై బీజేపీ నేత కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో కుమార్తె, కుమారుడు మరణించారు. (BJP Leader Shoots Wife And Children) భార్య, మరో కుమారుడి పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ బీజేపీ నేతను అరెస్ట్ చేశారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సంగతేడ గ్రామానికి చెందిన బీజేపీ కార్యవర్గ సభ్యుడు యోగేష్ రోహిల్లా శనివారం దారుణానికి పాల్పడ్డాడు. భార్య, ముగ్గురు పిల్లలపై గన్‌తో కాల్పులు జరిపాడు.
కాగా, అనంతరం యోగేష్ రోహిల్లా పోలీసులకు ఫోన్ చేశాడు. భార్య, పిల్లలపై కాల్పులు జరిపినట్లు చెప్పాడు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కాల్పుల్లో ఒక కుమారుడు, 11 ఏళ్ల కుమార్తె మరణించినట్లు గుర్తించారు. భార్య, మరో కుమారుడ్ని సహారన్పూర్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
మరోవైపు సంఘటనా స్థలంలోనే ఉన్న బీజేపీ నేత యోగేష్ రోహిల్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. కాల్పులకు వినియోగించిన గన్ స్వాధీనం చేసుకున్నారు. భార్య క్యారెక్టర్‌పై అనుమానంతో ఈ కాల్పులకు ఆయన పాల్పడినట్లు పోలీస్ అధికారి తెలిపారు. యోగేష్ మానసిక పరిస్థితి సరిగా లేనట్లుగా తెలిసిందని చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ కాల్పుల సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Shocking incident in #Uttarparadesh‘ #Saharanpur#BJP leader Yogesh Rohela shot his wife and 3 children
11 year old daughter Shraddha and a son died on the spot
Incident took place in Sagatheda village of Gangoh police station area pic.twitter.com/xdpmXSqQiI— Siraj Noorani (@sirajnoorani) March 22, 2025
#BREAKINGNEWS
-BJP नेता ने पत्नी-बच्चों पर फायरिंग की
– तीन बच्चों की मौत हो गई
-पत्नी की हालत गंभीर
-सहारनपुर के BJP नेता हैं Yogesh Rohillapic.twitter.com/aX7B4DpMh1— 4PM News Network (@4pmnews_network) March 22, 2025
#WATCH | Saharanpur, UP: Rohit Singh Sajwan, Saharanpur SSP says “Under Police Station Gangoh, a person named Yogesh Rohilla himself informed through phone that he had shot his wife and 3 children. When the police reached the spot, he said that he was worried about his wife’s… pic.twitter.com/78mxOJwY5W
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 22, 2025