అయోధ్య: సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మసీదు నిర్మాణం కోసం అయోధ్యలో కేటాయించిన భూమిని తిరిగి తీసుకోవాలని బీజేపీ నేత రజనీష్ సింగ్ డిమాండ్ చేశారు. ఆయన ఈ మేరకు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఈ నెల 10న లేఖ రాశారు.
మసీదును నిర్మించాలనే ఉద్దేశం ముస్లిం సముదాయానికి లేదని, మసీదు నెపంతో శాశ్వతంగా ప్రజల మధ్య ఘర్షణ వాతావరణాన్ని పెంచి పోషించాలని భావిస్తున్నదని ఆరోపించారు. ప్రార్థనలు చేయడానికి మసీదు అవసరం లేదని, అయినప్పటికీ, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా భూమిని వినియోగించాలని అయోధ్య మసీదు ట్రస్ట్‌కు కట్టుదిట్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.