Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
BJP leader pushes girl | గర్బా వేడుకలో పాల్గొనేందుకు వచ్చిన బాలిక పట్ల ఒక బీజేపీ నేత అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆమెను దూషించడంతో పాటు బయటకు తోసివేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ బాలిక ఫిర్యాదుతో ఆ బీజేపీ నేతపై కేసు కూడా నమోదైంది.
భోపాల్: గర్బా వేడుకలో పాల్గొనేందుకు వచ్చిన బాలిక పట్ల ఒక బీజేపీ నేత అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆమెను దూషించడంతో పాటు బయటకు తోసివేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ బాలిక ఫిర్యాదుతో ఆ బీజేపీ నేతపై కేసు కూడా నమోదైంది. (BJP leader pushes girl) బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. ఆదివారం సాయంత్రం ఇండోర్‌లోని హీరా నగర్ ప్రాంతంలో ‘కంకేశ్వరి గర్బా ఉత్సవం’ నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు 15 ఏళ్ల బాలిక అక్కడకు చేరుకున్నది.
కాగా, బీజేపీ మండల అధ్యక్షుడు కమల్ చౌహాన్, ఆ బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించారు. వేదికలోకి ఆమె ప్రవేశించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పండాల్ నుంచి బయటకు వెళ్లమని చెబుతూ ఆ బాలికను బలవంతంగా నెట్టివేశారు. ప్రతిస్పందించిన ఆమె తనను తాక వద్దని ఆయనను హెచ్చరించింది. అక్కడున్న కొందరు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో బీజేపీ మండల అధ్యక్షుడు కమల్ చౌహాన్ ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి.
మరోవైపు ఈ సంఘటన జరిగిన కొన్ని గంటలకే ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ‘కంకేశ్వరి గర్బా’ వేదికను సందర్శించారు. కన్యా పూజలో ఆయన పాల్గొనడంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. దీంతో బీజేపీపై కాంగ్రెస్ మండిపడింది. ముఖ్యమంత్రి చిన్న బాలికలకు పూజలు చేస్తుంటే, అదే వేదిక వద్ద ఒక మైనర్ బాలిక పట్ల ఆ పార్టీ నేత దురుసుగా ప్రవర్తించడాన్ని విమర్శించింది. ఆయనను బీజేపీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేసింది.
అయితే ఆ బాలిక కూడా బీజేపీ నేత కమల్ చౌహాన్‌పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కమల్ చౌహాన్‌పై క్రమశిక్షణ చర్యలు చేపడతామని బీజేపీ పేర్కొంది.
मध्य प्रदेश -इंदौर में गरबा उत्सव के दौरान नाबालिग लड़की से अभद्रता और धक्का-मुक्की हुई है। इस मामले में BJP मंडल अध्यक्ष कमल चौहान पर पॉक्सो सहित कई धाराओं में FIR दर्ज हुई है। वायरल वीडियो में कमल चौहान बेरिकेडिंग पार करके लड़की के पास पहुंचे।
#MadhyaPradesh #Indore https://t.co/RXCNxlDmyr— Arun (आज़ाद) Chahal 🇮🇳 (@ArunAzadchahal) October 18, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP leader
- Garba Event
- Girl
- Indore
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

