జైపూర్: కేరళలో కొండచరియలు విరిగిపడి వందలాది మంది మరణించిన క్రమంలో బీజేపీ సీనియర్ నేత ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేరళలో జరుగుతున్న గోహత్యల కారణంగానే ఇది జరిగిందని రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత జ్ఞానదేవ్ అహుజా ఆరోపించారు. గోహత్యలు ఎక్కడ జరిగినా ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకుంటాయని అన్నారు.