న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లును డీఎంకే వ్యతిరేకించింది. ఇవాళ ఆ పార్టీ ఎంపీ కనిమొళి(MP Kanimozhi ) మాట్లాడారు. ఒకవేళ డీలిమిటేషన్ బిల్లు సరైన దశలోనే ఉండి ఉంటే, అప్పుడు ఆ బిల్లును ఎందుకు తమిళనాడు అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టడం లేదని ఆమె ప్రశ్నించారు. డీలిమిటేషన్ అంశంపై ఏ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రితోనూ కేంద్రం సంప్రదించలేదని ఆమె ఆరోపించారు. 2021లో జనాభా లెక్కలను ప్రభుత్వం వాయిదా వేసిందని, ఇప్పుడు వాటి స్థానంలో పాత జనాభా లెక్కలను తీసుకుంటున్నారని, అయిదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పారు.
2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, రిజర్వేషన్ బిల్లును పాస్ చేయాలని విపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయని, ఓ రెండు వారాల పాటు ఆగే ఆలోచనలో బీజేపీ లేదని, ఎన్నికల రెస్క్యూ వ్యూహాం తరహాలో మహిళలను బీజేపీ వాడుకుంటున్నదని డీఎంకే ఎంపీ కనిమొళి తెలిపారు. గురువారం లోక్‌సభలో ఎందుకు 2023 నాటి మహిళా రిజర్వేషన్ చట్టాన్ని నోటిఫై చేశారని ఎంపీ ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్‌ను తప్పుదోవ పట్టించే రీతిలో బిల్లు ఉన్నదని, ఇది భారత ఫెడరల్ విధానాన్ని దెబ్బతీస్తున్నట్లుగా ఉందని ఆమె అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో ప్రామిస్‌లు చేసిందని కానీ అవన్నీ ఢిల్లీ గాలిలో కలిసిపోయినట్లు ఆమె చెప్పారు.
బిల్లులను ప్రవేశపెట్టి, ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లోనే పాస్ చేయాలని కోరడం, ఇది గుణాత్మక రాజకీయం అవుతుందన్నారు. మహిళా రిజర్వేషన్‌ను డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం ఓ ట్రాప్ అని, మహిళలను బీజేపీ ఓ కవచంలా వాడుకుంటోందని కనిమొళి అన్నారు. ప్రస్తుతం ఉన్న 543 స్థానాల్లో ఎందుకు రిజర్వేషన్ ఇవ్వలేకపోతున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను ఆమె అడిగారు. ఈ దేశ మహిళలు రాజకీయ అధికారం కోసం ఎన్నాళ్లుగా పడిగాపులు కాస్తున్నట్లు ఆమె చెప్పారు.