BJP @ HP | హిమాచల్‌ప్రదేశ్‌లో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నది. తప్పుడు వాగ్ధానాలతో, మోసపూరిత మాటలతో అక్కడి ఓటర్లను ఆకర్శించే పనిలో పడింది. ముఖ్యంగా మహిళలు, యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ అమలుకు వీలుకాని ఎన్నో హామీలను తమ ‘సంకల్ప్ పత్ర్’ లో గుప్పించింది.
హిమాచల్ రాజధాని సిమ్లాలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఆవిష్కరించారు. ఓటర్లను ఆకర్శించేలా 11 ప్రధాన హామీలను తమ సంకల్ప్ పత్ర్ లో చర్చారు. సంకల్ప్ పత్ర్‌లో ఇచ్చిన హామీలను చూసి అక్కడి ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. అమలు చేయడానికి వీలుపడని ఎన్నో వాగ్ధానాలు చేసి అధికారంలోకి రావాలని ఉవ్వీళ్లూరుతున్నట్లు కనిపిస్తున్నది.
సంకల్ప్ పత్ర్‌లో ముఖ్యమైన 11 వాగ్ధానాలు:
ఏకీకృత పౌర చట్టం అమలు
8 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు
మహిళలకు వడ్డీ లేని రుణాలు అందజేత
ప్రసవానంతరం గర్భిణీలకు రూ.25,000 ఆర్థిక సాయం
పేద మహిళలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు
30 ఏండ్ల పైబడిన పేద మహిళలకు అటల్ పెన్షన్ యోజన
మహిళలకు స్త్రీ శక్తి ఆరోగ్య కార్డులు
12 జిల్లాల్లో విద్యార్థినిల కోసం హాస్టల్స్ నిర్మాణం
బడికి పోయే అమ్మాయిలకు సైకిళ్లు, స్కూటీలు
సేపులపై (ఆపిల్స్) 12 శాతం వరకు జీఎస్టీ, ఆపై విధించే పన్నును ప్రభుత్వం భరిస్తుంది