మంగళవారం 26 జనవరి 2021
National - Jan 11, 2021 , 15:06:24

బీజేపీ పేద్ద‌‌‌ చెత్త పార్టీ: మ‌మ‌తాబెన‌ర్జి

బీజేపీ పేద్ద‌‌‌ చెత్త పార్టీ: మ‌మ‌తాబెన‌ర్జి

కోల్‌క‌తా: రైతుల ఆందోళ‌నపై బీజేపీ మొండి వైఖ‌రి కార‌ణంగా దేశంలో ఆహార సంక్షోభం త‌లెత్తే ప‌రిస్థితి నెల‌కొని ఉన్న‌ద‌ని ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జి విమ‌ర్శించారు. భార‌త్‌లో ఆహార సంక్షోభం త‌లెత్తే ప్ర‌మాదం ఉన్న‌ది. రైతుల విష‌యంలో బీజేపీ మొండి వైఖ‌రి ఇలాగే కొనసాగితే దేశంలో ఆహార కొర‌త ఏర్ప‌డ‌టం ఖాయం. రైతులు మ‌న దేశానికి ఆస్తులు. అందువ‌ల్ల మ‌నం రైతుల ప్ర‌యోజ‌నాలకు వ్య‌తిరేకంగా న‌డుచుకోవ‌డం క‌రెక్టు కాదు అని మ‌మతాబెన‌ర్జి వ్యాఖ్యానించారు. 

అంతేగాక బీజేపీ ఒక చెత్త పార్టీ అని మ‌మ‌తాబెన‌ర్జి మండిప‌డ్డారు. బీజేపీ పేద్ద‌ చెత్త పార్టీ. అవినీతిప‌రులు, ఎందుకు పనికిరాని నాయ‌కుల‌తో నిండిపోతున్న ఓ చెత్త‌కుప్ప‌లా బీజేపీ మారింది. బీజేపీ నేత‌లు పార్టీని ఒక వాషింగ్ మిష‌న్‌లాగా న‌డుపుతున్నారు. ఇత‌ర పార్టీలు దూరం పెట్టిన అవినీతిప‌రుల‌ను త‌మ పార్టీలో చేర్చుకుంటూ వారిని స‌త్పురుషులు, సాధువులుగా కొనియాడుతున్నారు అంటూ మ‌మ‌త ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo