న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ స్థానాన్ని మిత్రపక్షాలకు కేటాయిస్తారన్న వార్తలకు బీజేపీ తెరదించింది. ఆ పదవిని తమ పార్టీయే అట్టిపెట్టుకుంటుందని, మూడోసారి కూడా తమ వారే ఆ పదవిని అధిష్ఠిస్తారని ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.
ఈ పదవిని సంకీర్ణ పార్టీల వారు అడిగారంటూ మీడియాలో వస్తున్న వార్తలను బీజేపీ సీనియర్ నేత ఒకరు ఖండించారు. అయితే వారితో చర్చలు జరిపిన అనంతరం ఏకాభిప్రాయ సాధనతోనే తాము ఈ పదవిని చేపడతామని ఆయన చెప్పారు. ప్రధాని మోదీ ఇటలీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత స్పీకర్ పేరును ప్రకటిస్తారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.