అహ్మదాబాద్: గుజరాత్ గోద్రా అల్లర్ల తర్వాత జరిగిన నరోడా పాటియా మారణహోమం ఘటనలో దోషిగా తేలిన మనోజ్ కుక్రాణి కుమార్తెకు బీజేపీ అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. అహ్మదాబాద్ జిల్లాలోని నరోడా స్థానం నుంచే మనోజ్ కుమార్తె పాయల్ కుక్రాణిని బరిలోకి దింపడం చర్చనీయాంశంగా మారింది. నరోడా పాటియా అల్లర్లలో 97 మంది ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు.
ఈ కేసులో దోషులుగా తేలిన 16 మందిలో మనోజ్ కుక్రాణి ఒకరు. మనోజ్‌తో పాటు మరో 15 మంది దోషులకు కింది కోర్టు విధించిన శిక్షను గుజరాత్ హైకోర్టు కూడా 2018లో సమర్థించింది. మనోజ్ కుక్రాణి ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు. నరోడా సిట్టింగ్ ఎమ్మెల్యే బలరాం తవానీని పక్కనబెట్టి మరీ బీజేపీ పాయల్‌కు టికెట్ ఇవ్వడం గమనార్హం.