లక్నో: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై ఇటీవల అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే. వర్గీకరణతో పాటు క్రీమీలేయర్ గుర్తింపు అంశాలతో ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తోందని మాయావతి(Mayawati) ఆరోపించారు. ఇక ఈ అంశంపై మౌనంగా ఉన్న విపక్ష కూటమి ప్రాణాంతకంగా మారినట్లు ఆమె పేర్కొన్నారు. డీవై చంద్రచూడ్ నేపథ్యంలో ఏడుగురు సభ్యుల ధర్మాసనం.. ఎస్సీ, ఎస్టీల వర్గీకరణకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ఎస్సీ, ఎస్సీల్లో క్రిమీలేయర్‌ను గుర్తించేందుకు ఓ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆ తీర్పులో జస్టిస్ బీఆర్ గవాయి ఆదేశించారు.
ఈ అంశంపై బీఎస్సీ నేత మాయావతి ఇవాళ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలులో పాత విధానాన్ని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పాటించకపోవడం బాధాకరమని మాయావతి పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ అంశం పట్ల కేంద్రం సీరియస్‌గా లేదన్నారు. కోర్టులో కేంద్రం చాలా బలహీనంగా వాదించిందని, రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకురాలేదని, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా బీజేపీ ఉన్నదని మాయా ఆరోపించారు.
కాంగ్రెస్‌తో పాటు సమాజ్‌వాదీ పార్టీలను కూడా మాయా తప్పుపట్టారు. ఆ రెండు పార్టీలతో పాటు విపక్ష కూటమిలోని పార్టీలు మౌనంగా ఉన్నాయని, ఇది ప్రమాదకరంగా మారుతున్నట్లు ఆమె ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమంలో ఆ పార్టీలకు ఆసక్తి లేదని, కేవలం బీఎస్పీ పార్టీలోనే ఆ కాంక్ష ఉన్నట్లు ఆమె చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దళిత, గిరిజన సంఘాలు ఆగస్టు 21వ తేదీన దేశవ్యాప్త సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే.
1. एससी/एसटी आरक्षण में वर्गीकरण व क्रीमीलेयर का नया नियम लागू करने के माननीय सुप्रीम कोर्ट के दिनांक 1 अगस्त 2024 के निर्णय के विरुद्ध जन अपेक्षा के अनुसार पुरानी व्यवस्था बहाल रखने के लिए केन्द्र द्वारा अभी तक भी कोई ठोस कदम नहीं उठाया जाना यह अति-दुःखद व चिन्ताजनक।
— Mayawati (@Mayawati) August 23, 2024