చెన్నై: 2026లోజరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు అమిత్ షా శుక్రవారం ప్రకటించారు. 1998 నుంచి అన్నాడీఎంకే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షమని, మాజీ ముఖ్యమంత్రి జే జయలలిత, ప్రధాని మోదీ గతంలో కలిసి పనిచేశారని ఆయన గుర్తు చేశారు. తమ కూట మి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈపీఎస్ ఉంటారని స్పష్టం చేశారు.
తమిళనాడు బీజేపీ నూతన అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నాయకుడు, శాసనసభ్యుడు నైనార్ నాగే ంద్రన్ ఎంపికయ్యారు. ఆయన ఎంపికను బీజేపీ నాయకత్వం ఏకగ్రీవంగా ఆమోదించింది. నయనార్ నాగేంద్రన్ ఎంపికపై శనివారం అధికారికంగా ప్రకటన వెలువడనున్నది. 2017లో నాగేంద్రన్ ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు.