భోపాల్: మధ్యప్రదేశ్లోని దతియా ఉప ఎన్నికలో కీలక పరిణామం జరిగింది. బీజేపీ సీనియర్ నేతకు ఆ పార్టీ టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన మద్దతుదారులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. రహదారిని దిగ్బంధించడంతోపాటు పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. (Datia Bypoll) దతియా నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బీజేపీ సీనియర్ నేత డాక్టర్ నరోత్తమ్ మిశ్రా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ స్థానంలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి రాజేంద్ర భారతిని 2015 నాటి బ్యాంక్ మోసం కేసులో దోషిగా ఢిల్లీలోని ప్రత్యేక ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు నిర్ధారించింది. ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించడంతో ఏప్రిల్లో శాసనసభ సభ్యత్వం రద్దయింది. దీంతో దతియాలో ఉప ఎన్నిక షెడ్యూల్ను ఈసీ ప్రకటించింది.
కాగా, దతియా అసెంబ్లీ స్థానం నుంచి తిరిగి పోటీ చేసేందుకు నరోత్తమ్ మిశ్రా సన్నద్ధమయ్యారు. తాను తిరిగి వస్తానన్న వాగ్దానాన్ని నెరవేర్చేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. నాలుగు నెలలుగా దతియాలో విస్తృతంగా పర్యటించి కార్యకర్తలను కలిశారు. బహిరంగ సభలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో సీనియర్ నేత, మాజీ మంత్రికి పార్టీ టికెట్ దక్కుతుందని బీజేపీ నేతలంతా భావించారు.
అయితే నరోత్తమ్ మిశ్రాకు బీజేపీ షాక్ ఇచ్చింది. బీజేపీ మాజీ డివిజనల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ అశుతోష్ తివారీని అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో నరోత్తమ్ మద్దతుదారులు ఆగ్రహించారు. పార్టీ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలువురు కార్యకర్తలు రాజీనామాలు ప్రకటించారు.
మరోవైపు గ్వాలియర్-ఝాన్సీ జాతీయ రహదారిని నిరసకారులు దిగ్బంధించారు. రాళ్ల దాడికి పాల్పడటంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. నామినేషన్ దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 13 కావడంతో దతియాలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి పెరిగాయి. దీంతో ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక వివాదం అధికార బీజేపీకి తలనొప్పిగా, ఆ ప్రాంతంలో శాంతిభద్రతల సంక్షోభంగా మారింది. దతియాలో జూలై 30న పోలింగ్, ఆగస్ట్ 3న ఓట్ల లెక్కింపు జరుగనున్నాయి.
Party workers stage protest at the BJP office in #Datia
Workers protest vehemently after #NarottamMishra is denied a ticket
Datia BJP office shut down
Traffic jam on the national highway pic.twitter.com/VE73PSl2xJ
— Kunal Verma (@thekunalverma) July 10, 2026