బెంగళూరు, ఏప్రిల్ 7: ఆరెస్సెస్ అంతర్గత సర్వే ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కనీసం 200 స్థానాలైనా గెలవలేదని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు. శనివారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ఆరెస్సెస్ సర్వే ప్రకారం కర్ణాటకలో కమలం పార్టీ కనీసం ఎనిమిది సీైట్లెనా గెలవలేదన్నారు. బీజేపీని ప్రక్షాళించాలని ఆ పార్టీ నాయకులే మాట్లాడుతున్నారని ఖర్గే అన్నారు. ‘ఒక కుటుంబం వల్ల రాష్ట్రంలో పార్టీ కలుషితమైందని వాళ్లే చెప్తున్నారు. అసలైన బీజేపీని తిరిగి స్థాపించాలని వారు కోరుతున్నారు. బసనగౌడ్ పాటిల్, సీటీ రవి, అనంత్‌కుమార్ హెగ్డే, ఈశ్వరప్ప లాంటి హిందుత్వ నాయకులకు అన్యాయం జరిగిందని ఆ పార్టీ నేతలే అంటున్నారు. వాళ్లలో వాళ్లే కొట్లాడుకుంటున్నారు. మేమేం చేయలేదు’ అని ఖర్గే చెప్పారు.