(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): తాము డబ్బులిచ్చినా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వడం లేదని రాజస్థాన్‌లో కొందరు బీజేపీ నాయకులు మీడియాకెక్కుతున్నారు. తాజాగా ఫతేహ్పూర్ టికెట్ ఆశించిన ఆనంద్ హడ్డా మాట్లాడుతూ ఏడెనిమిది నెలల క్రితమే తనకు టికెట్ ఇవ్వడానికి బీజేపీ పెద్దలతో డీల్ కుదిరిందని.. రూ.2 కోట్లు ఇవ్వాలని అడిగారని తెలిపారు.
భరత్‌పూర్‌కు చెందిన బీజేపీ ఇన్చార్జి సోమకాంత్ శర్మ, బీజేపీ కార్యదర్శి చంద్రశేఖర్, మరో నేత రాజ చౌదరిలకు తాను రూ.50 లక్షల నగదు ఇచ్చానని చెప్పారు. అయినా తనకు టికెట్ ఇవ్వలేదన్నారు.