హైదరాబాద్, మే 13: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోతెగ హడావుడి చేశారు. ఆయన తిరిగిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఘోర పరాజయం పాలైంది. కొన్నిచోట్ల బీజేపీ మూడో స్థానంలో నిలువగా.. మరికొన్ని నియోజకవర్గాల్లో స్వతంత్రుల తర్వాత ఏకంగా ఐదో స్థానంలో కమలం పార్టీ ఉండిపోవడం గమనార్హం. కోలార్, గౌరీబిదనూర్, చింతామణి, ములబాగళ్, బాగేపల్లి, చిక్కబళ్లాపుర్లో బీజేపీ అభ్యర్థుల తరపున బండి సంజయ్ ప్రచారం చేశారు. ‘మోదీ పైసలు పక్కా తీసుకోండి.. ఓటు మాత్రం కాంగ్రెస్‌కు వేయండి’ అంటూ ఆయన ఇచ్చిన పిలుపును ఆ రాష్ట్ర ప్రజలు పక్కాగా పాటించినట్టే ఉన్నారని ఫలితాల నేపథ్యంలో బండి సంజయ్‌పై వ్యంగ్యాస్ర్తాలు పేలుతున్నాయి.