ప్రధానితో భేటీకి దీదీ దూరం : మమతా బెనర్జీపై నడ్డా ఫైర్

న్యూఢిల్లీ : యాస్ తుఫాన్ పై ప్రధాని నరేంద్ర మోదీ సమావేశానికి హాజరు కారాదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తప్పుపట్టారు. దీదీ తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని వ్యాఖ్యానించారు. బెంగాల్ సీఎం చిల్లర రాజకీయాలు, వ్యూహాలు మరోసారి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
యాస్ తుఫాన్ తో నష్టపోయిన బెంగాల్ ప్రజలకు ప్రధాని మోదీ గట్టి భరోసా ఇస్తూ ముందుకు రాగా, మమతా బెనర్జీ సైతం ప్రజల కోసం పట్టింపులను పక్కనపెట్టి హుందాగా వ్యవహరించాల్సి ఉందని నడ్డా పేర్కొన్నారు. ప్రధాని సమావేశానికి దీదీ గైర్హాజరవడం రాజ్యాంగ విలువలను కాలరాయడమేనని, సహకార సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడవడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం బెంగాల్ , ఒడిషా రాష్ట్రాల్లో యాస్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

