కొచ్చి: కేరళలోని వయనాడ్ లోక్ సభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ వాద్రా గెలుపును రద్దు చేయాలని ఆమె ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ కోరారు. ఈ మేరకు నవ్య కేరళ హైకోర్టులో ఓ పిటిషన్ను దాఖలు చేశారు.
ప్రియాంక తన, తన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను, కేసుల జాబితాను వెల్లడించడంలో విఫలమయ్యారని ఆమె ఆరోపించారు. ప్రియాంక ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారన్నారని తెలిపారు. ఇది అవినీతికి పాల్పడటమేనని చెప్పారు.