Ratna Debnath: ఆర్జీ కార్ కాలేజీలో రేప్ ఘటన.. వెనుకంజలో బాధితురాలి తల్లి
Ratna Debnath: ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ఓ యువతిని అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ బాధితురాలి తల్లి రత్నా దేబనాథ్ బీజేపీ టికెట్‌పై పోటీ చేశారు. పాణిహట్టి సీటు నుంచి ఆమె ఎన్నికల్లో నిలిచారు. కానీ ఆమె వెనుకంజలో ఉన్నారు.
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ఓ యువతిని అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ బాధితురాలి తల్లి రత్నా దేబనాథ్(Ratna Debnath) బీజేపీ టికెట్‌పై పోటీ చేశారు. పాణిహట్టి సీటు నుంచి ఆమె ఎన్నికల్లో నిలిచారు. తాజా సమాచారం ప్రకారం రత్నా దేబనాథ్.. వెనుకంజలో ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి తీర్థాంకర్ ఘోష్ .. ఆ స్థానం నుంచి లీడింగ్‌లో ఉన్నారు. ఆర్జీ కార్ కాలేజీ బాధితురాలి తల్లి వెనుకంజలో ఉన్నా.. బీజేపీ పార్టీ మాత్రం ఆ రాష్ట్రంలో ముందంజలో కొనసాగుతున్నది. తాజా ఫలితాల ప్రకారం బీజేపీ 194 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. తృణమూల్ కాంగ్రెస్ 96 స్థానాల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. పశ్చిమ బెంగాల్లో మహిళల పట్ల హింస పెరుగుతోందని రత్నా దేబనాథ్ ఎన్నికల వేళ ప్రచారం నిర్వహించారు. ఈ అంశంపై ఆమె పోరాటం చేసినా.. ఎన్నికల్లో మాత్రం ఓట్లను రాబట్టుకోలేకపోయినట్లు తెలుస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

