కురుక్షేత్ర: కొందరు కార్యకర్తలు తమ అర చేతులను నేలపై ఉంచగా వారిని ఆశీర్వదిస్తూ బీజేపీ నేత ఒకరు వారి చేతులపై నడుచుకుంటూ వెళ్లడం వివాదంగా మారింది. ఈ నెల 5న జరిగే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పెహోవా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జై భగవాన్ శర్మ ఇటీవల ఆ నియోజకవర్గంలో పర్యటించారు.
వీర విధేయులైన కొందరు బీజేపీ కార్యకర్తలు భగవాన్ శర్మ పట్ల తమ విధేయతను చాటుకోవడానికి నేలపై మోకాళ్లపై కూర్చుని తమ రెండు చేతులను నేలపై ఉంచి, దానిపై నడిచి తమను ఆశీర్వదించాలని ఆయనను కోరారు. దీనికి భగవాన్ అభ్యంతరం చెప్పకుండా దర్జాగా వారి చేతులను తొక్కుకుంటూ నడిచారు. దీనిపై పలువురు నెటిజన్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.