BJP Incharges | మహారాష్ట్ర, జార్ఖండ్, హరియాణా సహా జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి తర్వలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాలకు బీజేపీ అధిష్ఠానం ఇన్చార్జీలను సోమవారం ప్రకటించింది. జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఇన్‌చార్జీగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని నియమించింది. మహారాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్, కో ఇన్చార్జిగా కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను నియమించగా.. హరియాణా బాధ్యతలను ధర్మేంద్ర ప్రధాన్, బిప్లబ్ కుమార్దేవ్లకు అప్పగించింది. ఇక జార్ఖండ్ బాధ్యతలను శివరాజ్ సింగ్ చౌహాన్‌తో పాటు హిమంత బిస్వా శర్మలను నియమించినట్లు తెలిపింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda ने आगामी विधानसभा चुनाव- महाराष्ट्र, हरियाणा, झारखंड एवं जम्मू कश्मीर के लिए प्रदेश चुनाव प्रभारी एवं सह-प्रभारियों की नियुक्ति की है। pic.twitter.com/L4SbOrVrbI
— BJP (@BJP4India) June 17, 2024