BJP Activist: ఫేక్ న్యూస్ షేర్ చేసిన బీజేపీ కార్యకర్త అరెస్టు
BJP Activist: ఫేక్ న్యూస్ షేర్ చేస్తున్న బీజేపీ కార్యకర్తను కేరళలో అరెస్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ 2 ఫలితాలను విత్‌డ్రా చేసినట్లు ఆ వ్యక్తి ఆన్లైన్లో ఫేక్ వార్తలను ప్రచారం చేశాడు. ఈ ఘటనలో నిందితుడు నిఖిల్ మనోహర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
కొల్లామ్: కేరళలో ఫేక్ న్యూస్ షేర్ చేస్తున్న బీజేపీ కార్యకర్త(BJP Activist)ను అరెస్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ 2 ఫలితాలను విత్‌డ్రా చేసినట్లు ఆ వ్యక్తి ఆన్లైన్లో ఫేక్ వార్తలను ప్రచారం చేశాడు. ఈ ఘటనలో నిందితుడు నిఖిల్ మనోహర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పొరువాజి గ్రామ పంచాయతీకి చెందిన అతన్ని అరెస్టు చేశారు. విద్యాశాఖ మంత్రి వీ శివణ్కుట్టి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అతన్ని అరెస్టు చేశారు మే 25వ తేదీన ప్రకటించిన ప్లస్ 2 ఫలితాలను విత్‌డ్రా చేసుకున్నట్లు నిఖిల్ ఓ పోస్టర్‌ను తయారు చేసి ప్రచారం చేశాడని, ఆ పోస్టర్‌పై మంత్రి ఫోటో, స్టేట్మెంట్ ఉందని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో ఆ పోస్టర్ వైరల్ కావడంతో ఆ మంత్రి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా నిఖిల్‌ను అరెస్టు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

