Hindenburg Report | దేశంలో ఆర్ధిక అరాచకాన్ని ప్రేరేపిస్తున్న రాహుల్ గాంధీ : రవిశంకర్ ప్రసాద్
Hindenburg Report : హిండెన్‌బర్గ్ లేటెస్ట్ రిపోర్ట్‌పై కాషాయ పాలకులే లక్ష్యంగా విమర్శల దాడి చేపట్టిన కాంగ్రెస్ తీరును బీజేపీ ఎండగట్టింది.
Hindenburg Report : హిండెన్‌బర్గ్ లేటెస్ట్ రిపోర్ట్‌పై కాషాయ పాలకులే లక్ష్యంగా విమర్శల దాడి చేపట్టిన కాంగ్రెస్ తీరును బీజేపీ ఎండగట్టింది. కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ భారత స్టాక్ మార్కెట్ల సమగ్రతను ప్రశ్నిస్తూ దేశంలో ఆర్దిక అరాచకాన్ని ప్రేరేపిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ హిండెన్‌బర్గ్ నివేదిక శనివారం వచ్చిందని, ఆదివారం దీనిపై గందరగోళం చెలరేగితే సోమవారం క్యాపిటల్ మార్కెట్లో అస్ధిరత నెలకొంటుందని వ్యాఖ్యానించారు.
అదానీ విదేశ ఫండ్లలో సెబీ చీఫ్ మాధవి పురి బుచ్ ఆమె భర్తకు వాటాలున్నాయని హిండెన్‌బర్గ్ తాజా నివేదికలో వెల్లడించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నివేదికలో ఆరోపణలు నిరాధారమైనవని మాధవి పురి బుచ్ తోసిపుచ్చారు. అయితే ఈ వ్యవహారంపై కేంద్రాన్ని నిలదీసిన విపక్షాలు జాయింట్ పార్లమెంటరీ కమిటీ దర్యాప్తునకు డిమాండ్ చేశాయి. ఇక ఈ నివేదిక వెల్లడించిన సమయాన్ని పరిశీలిస్తే ఏదో జరుగుతున్నదని అర్ధమవుతుందని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.
జులైలో సెబీ నుంచి హిండెన్‌బర్గ్‌కు షోకాజ్ నోటీసు జారీ అయింది. ఈ నోటీసుకు బదులివ్వాల్సింది పోయి హిండెన్‌బర్గ్ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తోందని దుయ్యబట్టారు. దీనిపై సెబీ, సెబీ చీఫ్ స్పందించారని తెలిపారు. హిండెన్‌బర్గ్‌లో అమెరికన్ బిలియనీర్ జార్జ్ సొరోస్ కీలక ఇన్వెస్టర్ కావడంతో ఇందులో భారీ కుట్రకు తెరలేపారనే అనుమానాలున్నాయని ఆయన ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ విపరీతమైన ద్వేషాన్ని వెళ్లగక్కుతున్నారని ఆయన అన్నారు.
Read More :
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

