BITSAT 2025 : బిట్‌శాట్ 2025 సెషన్ 1 పరీక్ష కోసం అభ్యర్థుల స్లాట్ బుకింగ్‌లు మొదలయ్యాయి. అందుకోసం బిట్‌శాట్ అధికారిక వెబ్సైట్ bitsadmission.comలో లింకును యాక్టివేట్ చేశారు. అయితే బిట్‌శాట్ 2025 స్లాట్ బుకింగ్ పోర్టల్‌ను యాక్సెస్ చేయడానికి అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను వినియోగించాలి. ఈ పోర్టల్ ద్వారా అభ్యర్థులు తమకు నచ్చిన పరీక్ష తేదీ, టైమ్ స్లాట్, టెస్ట్ సెంటర్‌ను ఎంపికచేసుకోవచ్చు. బీఈ, ఎమ్మెస్సీ, బీఫార్మా తదితర కోర్సులలో ప్రవేశాల కోసం ఏటా బిటిశాట్ పరీక్ష నిర్వహిస్తారు.
బిటశాట్ 2025 పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. తొలి సెషన్ పరీక్షలు మే 26 నుంచి మే 30 వరకు, రెండో సెషన్ పరీక్షలు జూన్ 22 నుంచి జూన్ 26 వరకు జరుగుతాయి. సెషన్ 1 పరీక్షల కోసం స్లాట్ బుకింగ్స్ మే 13న ప్రారంభమయ్యాయి. మే 16 చివరి తేదీ. మే 23న హాల్‌టికెట్లు విడుదల చేయనున్నారు.
ముందుగా బిట్‌శాట్ అధికారిక వెబ్సైట్ bitsadmission.com కు వెళ్లాలి. స్లాట్ బుకింగ్ లింక్‌పై క్లిక్ చేయాలి. అక్కడ అభ్యర్థులు తమ దరఖాస్తు నెంబర్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి. అనంతరం ‘లాగిన్’ బటన్ నొక్కాలి. ఆ తర్వాత ప్రాధాన్యత, లభ్యత ప్రకారం పరీక్ష తేదీలను, స్లాట్లను, పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవాలి.
బిట్‌శాట్ 2025 పరీక్షను ఒక అభ్యర్థి గరిష్ఠంగా రెండుసార్లు రాయవచ్చు. రెండు సెషన్లలో పరీక్షలు రాసేందుకు అభ్యర్థులు అర్హులు. అయితే అభ్యర్థి ముందుగా ఒక సెషన్‌ను మాత్రమే ఎంచుకోవాలి. రెండో సెషన్ కోసం మే 26 నుంచి జూన్ 10వ తేదీ వరకు స్లాట్ బుకింగ్స్ జరుగుతాయి. రెండు సెషన్లలో అభ్యర్థికి ఏ సెషన్లో ఎక్కువ మార్కులు వస్తే ఆ సెషన్ మార్కులను పరిగణలోకి తీసుకుంటారు.
కేవలం ఒక సెషన్లో మాత్రమే పరీక్ష రాసేందుకు పురుష అభ్యర్థులైతే రూ.3500, మహిళా అభ్యర్థులైతే రూ.3000 ఫీజు చెల్లించాలి. రెండు సెషన్ల కోసం పురుష అభ్యర్థులు రూ.5500, మహిళ అభ్యర్థులు రూ.4500 చెల్లించాల్సి ఉంటుంది.