ఇంఫాల్: మణిపూర్ సీఎంగా బీరెన్ సింగ్ (Biren Singh) మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఇంఫాల్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలో బీజేపీ పూర్తిస్థాయి మెజారిటీ సాధించడంతో మరోసారి అధికారంలోకి వచ్చింది. మొత్తం 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో.. బీజేపీ 32 స్థానాల్లో గెలుపొందింది. దీంతో ఆదివారం జరిగిన బీజేపీ శాసనసభపక్ష సమావేశంలో ఆయననే సభానాయకుడిగా ఎంపికయ్యారు.
హెయ్గాంగ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పంగీజం శరత్చంద్ర సింగ్‌పై 18 వేల ఓట్లతో బీరెన్ సింగ్ ఘన విజయం సాధించారు. దీంతో ఆయన ఎమ్మెల్యేగా ఐదోసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు. 2016 అక్టోబర్‌లో కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్‌పై తిరుగుబాటు చేసిన బీరెన్ సింగ్.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం బీజేపీలో చేరారు.