లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. గోరఖ్‌పూర్‌లోని జంతు ప్రదర్శన శాలలో ఓ పులి బర్డ్ ఫ్లూతో మరణించినట్లు గుర్తించారు. దీంతో ఇటావా జిల్లాలోని సింహాల అభయారణ్యంతోపాటు, రాష్ట్రంలోని అన్ని జంతు ప్రదర్శన శాలల్లోకి వారంపాటు సందర్శకులను అనుమతించరాదని నిర్ణయించారు.