రాంచీ: జార్ఖండ్‌లో (Jharkhand) బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది. రామ్‌గఢ్ (Ramgarh) జిల్లాకు చెందిన ఓ తొమ్మిది నెలల చిన్నారికి బర్డ్ ఫ్లూ (Bird flu) సోకింది. దీంతో ఆ చిన్నారికి వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత లక్షణాలతో 9 నెలల చిన్నారి రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS)లో చేరారని పీడియాట్రిక్స్ విభాగానికి చెందిన సీనియర్ డాక్టర్ రాజీవ్ మిశ్రా (Dr. Rajeev Mishra) తెలిపారు.
చిన్నారి నాసల్ స్వాబ్‌ను (Nasal Swab) సేకరించి జెనెటిక్స్ అండ్ జెనోమిక్స్ డిపార్ట్మెంటుకు పరీక్షల నిమిత్తం పంపించామన్నారు. అందులో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిందని చెప్పారు. దీంతో చిన్నారిని ఇతరుల నుంచి వేరుచేసి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నామని తెలిపారు. కోవిడ్-19 (Covid-19) నిబంధనలు పాటిస్తున్నామని తెలిపారు. దవాఖానలో ఈ ఏడాది ఇదే తొలి బర్డ్ ఫ్లూ కేసన్నారు.