Child kidnap | సొంత బిడ్డను కిడ్నాప్ చేసినట్లు తండ్రిపై కేసు నమోదు చేయడం సరికాదు: హైకోర్టు
Child kidnap | చట్టపరమైన నిషేధం లేనప్పుడు సొంత బిడ్డను కిడ్నాప్ చేశాడనే ఆరోపణలపై జన్మ నిచ్చిన తండ్రిపై కేసు నమోదు చేయడం సరికాదని బాంబే హైకోర్టుకు చెందిన నాగ్‌పూర్ బెంచ్ పేర్కొంది. (Child kidnap) విడిపోయిన భార్య ఫిర్యాదుతో 35 ఏళ్ల వ్యక్తిపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఆర్ఎర్ను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది.
ముంబై: చట్టపరమైన నిషేధం లేనప్పుడు సొంత బిడ్డను కిడ్నాప్ చేశాడనే ఆరోపణలపై జన్మ నిచ్చిన తండ్రిపై కేసు నమోదు చేయడం సరికాదని బాంబే హైకోర్టుకు చెందిన నాగ్‌పూర్ బెంచ్ పేర్కొంది. (Child kidnap) విడిపోయిన భార్య ఫిర్యాదుతో 35 ఏళ్ల వ్యక్తిపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఆర్ఎర్ను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. 2023 మార్చి 29న తన మూడేళ్ల కుమారుడ్ని విడిపోయిన భర్త కిడ్నాప్ చేసినట్లు ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ వ్యక్తిపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు.
కాగా, ఆ వ్యక్తి బాంబే హైకోర్టుకు చెందిన నాగ్‌పూర్ బెంచ్‌ను ఆశ్రయించాడు. తన బిడ్డకు తాను బయోలాజికల్ తండ్రినని, సహజ సంరక్షకుడినని కోర్టుకు తెలిపాడు. తనపై నమోదు చేసిన కిడ్నాప్ కేసును రద్దు చేయాలని కోరాడు. న్యాయమూర్తులు వినయ్ జోషి, వాల్మీకి ఎస్ఏ మెనెజెస్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. కోర్టు నుంచి ఉత్తర్వులు లేదా ఆదేశాలు లేనప్పుడు తల్లితో పాటు తండ్రి కూడా చట్టబద్ధమైన సంరక్షకుడేనని ధర్మాసనం తెలిపింది. ఈ నేపథ్యంలో తల్లి కస్టడీ నుంచి బిడ్డను తీసుకెళ్లిన తండ్రిపై కిడ్నాప్ కేసు నమోదు చేయడం తగదని పేర్కొంది.
మరోవైపు హిందూ మైనారిటీ, గార్డియన్షిప్ చట్టం ప్రకారం మైనర్ బిడ్డకు మొదటి సహజ సంరక్షకుడు తండ్రి అని, ఆ తర్వాత తల్లి అని కోర్టు గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు నుంచి తల్లికి ఎలాంటి ఆదేశాలు లేకపోతే బిడ్డను తన కస్టడీలోకి తీసుకున్న తండ్రిపై కిడ్నాప్ ఆరోపణలు నమోదు చేయరాదని స్పష్టం చేసింది. ఆ వ్యక్తిపై నమోదైన కిడ్నాప్ కేసును రద్దు చేస్తూ అక్టోబర్ 6న తీర్పు ఇచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

