న్యూఢిల్లీ: భారత్, జపాన్ మధ్య ద్వైపాక్షిక నేవీ విన్యాసాలు శుక్రవారంతో ముగిశాయి. JIMEX 5వ ఎడిషన్ను అరేబియా సముద్రంలో అక్టోబర్ 6 నుండి 8 వరకు నిర్వహించినట్లు భారత నౌకాదళం తెలిపింది. ఇరు దేశాలకు చెందిన యుద్ధ నౌకలు పలు సముద్ర విన్యాసాల్లో పాల్గొన్నట్లు పేర్కొంది. ఎయిర్ ఫోర్స్ డే నేపథ్యంలో శుక్రవారం మిగ్ 29కే ఫైటర్ జెట్స్ నిర్వహించిన షిప్ కంట్రోల్ బియాండ్ విజువల్ రేంజ్ (BVR) విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచినట్లు వెల్లడించింది.
#WATCH | Ship controlled Beyond Visual Range (BVR) combat drills by MiG 29K fighters during the 5th edition of bilateral maritime exercise JIMEX, between Japan & India
— ANI (@ANI) October 8, 2021
(Video source: Indian Navy) pic.twitter.com/x6zPV9RIDW