 
                                                            బెంగళూరు : ఫుడ్ డెలివరీ ఏజెంట్ తన బైక్‌తో కారు అద్దాన్ని రాసుకుంటూ వెళ్లినందుకు ఆ కారులోని దంపతులు ఆ ఏజెంట్ మరణానికి కారకులయ్యారు. బెంగళూరు నగరంలోని పుట్టెనహళ్లి ప్రాంతంలో ఈ నెల 25 రాత్రి 9.30 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఫుడ్ డెలివరీ ఏజెంట్ దర్శన్ (24), వరుణ్ ఓ గేర్‌లెస్ స్కూటర్‌పై వెళ్తున్నారు. మనోజ్ కుమార్, ఆర్తి శర్మ దంపతులు కారులో ప్రయాణిస్తున్నారు.
కారు అద్దాన్ని రాసుకుంటూ స్కూటర్ వెళ్లింది. దీనికి దర్శన్ క్షమాపణ చెప్పాడు. కానీ కుమార్ తీవ్ర ఆగ్రహంతో స్కూటర్‌ను వెంబడించి ఢీకొట్టాడు. దర్శన్ మరణించగా, వరుణ్ గాయపడ్డాడు. కుమార్, ఆర్తి సంఘటన స్థలంలో పడిపోయిన కారు విడి భాగాలను తీసుకెళ్లిపోయారు. వీరిద్దరూ మొదట మాస్క్‌లు ధరించారు. ఆ తర్వాత మాస్క్‌లను తొలగించడంతో వీరిద్దరి ముఖాలు సీసీటీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపించాయి.
 
                            