లక్నో: రోడ్డుపై ఒక ఎద్దు ఉన్నది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపైకి అది దూసుకెళ్లింది. (Bull Runs Into Bike) బైక్‌తో సహా కింద పడిన అతడు గాయపడ్డాడు. కొందరు వ్యక్తులు పరుగున అక్కడకు వచ్చారు. బైక్‌ను పైకి లేపి కింద పడిన ఆ వ్యక్తిని కాపాడారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 13న రాత్రి 8.30 గంటల సమయంలో నోయిడాలోని సూపర్‌టెక్ ఆక్స్ఫర్డ్ స్క్వేర్ సమీపంలోని రోడ్డులో ఒక వ్యక్తి బైక్‌పై వెళ్తున్నాడు. అయితే డివైడర్ వద్ద ఉన్న నల్లటి ఎద్దు ఆ వ్యక్తి మీదకు దూసుకెళ్లింది. దీంతో బైక్ అదుపుతప్పడంతో ఆ వ్యక్తి కిందపడ్డాడు.
కాగా, ఇది చూసిన కొందరు వ్యక్తులు పరుగున అతడి వద్దకు వచ్చారు. బైక్ కింద పడిన అతడ్ని పైకి లేపారు. ఆ వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. అయితే బైక్ వెనుక వస్తున్న కారు డ్యాష్‌బోర్డ్ కెమెరాలో ఈ సంఘటన రికార్డ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
This accident happened just now in front of Supertech Oxford Square in Sector 16-B, Greno West.
People should ride carefully and wear helmet 🙏 pic.twitter.com/ByaYTrqH3L— Greater Noida West (@GreaterNoidaW) November 13, 2024