అలీగఢ్: యూట్యూబ్ స్టార్, బైకర్ అగస్టే చౌహాన్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్‌లో ఈ ప్రమాదం జరిగింది. బైక్ రైడింగ్ చేస్తున్న అతడిని వెనుక నుంచి మరో వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని తమ ప్రాథమిక విచారణలో తేలిందని, బైక్ గంటకు 300 కిలోమీటర్ల స్పీడ్ అందుకుందని ప్రమాదం సమయంలో అగస్టే మాట్లాడటం అతడు తీసుకున్న వీడియోలో రికార్డయ్యిందని అలీగఢ్ డీఐజీ ఆనంద్ కులకర్ణి చెప్పారు.
ఉత్తరాఖండ్‌కు చెందిన అగస్టే చౌహాన్ బైక్‌తో విన్యాసాలు, రైడ్లు చేస్తూ ఆ వీడియోలను యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తుంటాడు. ఈ క్రమంలో అతను యూట్యూబ్ స్టార్‌గా ఎదిగాడు. ప్రస్తుతం అతని యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 12.40 లక్షలకు చేరింది. అయితే, తన ఛానెల్ కోసం మరో వీడియో చేస్తూ అగస్టే ప్రాణాలు కోల్పోయాడు.