30/30.. చరిత్ర సృష్టించిన బిజూ జనతాదళ్..!!
ఒడిశా అధికార పార్టీ బిజూ జనతాదళ్ (బీజేడీ) చరిత్ర సృష్టించింది. రాష్ట్రంలోని 30 జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకుని రికార్డు నెలకొల్పింది. ఈ పంచాయతీరాజ్ సంస్థల అధ్యక్షుల్లో 70 శాతం మంది మహిళలే ఉండడం విశేషం
ఒడిశా అధికార పార్టీ బిజూ జనతాదళ్ (బీజేడీ) చరిత్ర సృష్టించింది. రాష్ట్రంలోని 30 జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకుని రికార్డు నెలకొల్పింది. ఈ పంచాయతీరాజ్ సంస్థల అధ్యక్షుల్లో 70 శాతం మంది మహిళలే ఉండడం విశేషం. అలాగే, 15 జిల్లా పరిషత్‌ల అధ్యక్షులు 40 ఏళ్లలోపు వయస్సువారే.
ఈ సందర్భంగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 30 జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేసి తమ పార్టీ చరిత్ర సృష్టించిందన్నారు. ఒడిశా చరిత్రలో ఇది మొదటిసారని పేర్కొన్నారు. బహుశా దేశవ్యాప్తంగా ఒకే పార్టీ రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేయడం కూడా తొలిసారే కావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, రాయగడ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన సరస్వతి మాఝీ (23) అత్యంత పిన్నవయస్కురాలు. ఆమె తర్వాత 26 ఏళ్ల వయస్సులోనే మల్కాన్గిరీ చైర్‌పర్సన్‌గా సమారి టంగుల్ ఎన్నికయ్యారు. వీరితో కలిపి మొత్తం 21 మంది మహిళలు చైర్పర్సన్లుగా ఎన్నికయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

