పాట్నా: స్థానికుల డిమాండ్ మేరకు బీహార్‌లోని గయ పట్టణం పేరును రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. గయ టౌన్‌కు గయ జీ అని పేరు పెట్టింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ చేసిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని క్యాబినెట్ శుక్రవారం ఆమోదించింది.
గయాసురుడు అనే రాక్షసుడి పేరును ఈ పట్టణానికి పెట్టారు. వాయు పురాణం ప్రకారం, త్రేతా యుగంలో ఈ ప్రాంతంలో గయాసురుడు ఉండేవాడు. ఆయన శ్రీ మహా విష్ణువు కోసం తపస్సు చేసి, వరం పొందాడు. ఏటా లక్షలాది మంది ఇక్కడికి వచ్చి, పితృ దేవతలకు పిండ ప్రదానాలు చేస్తారు.