న్యూఢిల్లీ, జూలై 22 : బీహార్ ఓటర్ జాబితా నుంచి 52 లక్షల మందికిపైగా పేర్లను తొలగించినట్టు ఎన్నికల కమిషన్ (ఈసీ) మంగళవారం తెలిపింది. తొలగించిన వాటిలో 18 లక్షల పేర్లు.. మృతిచెందిన ఓటర్లవి కాగా, మరో 26 లక్షల మంది ఇతర నియోజకవర్గాలకు తరలిపోయారని, రెండు చోట్ల నమోదైనవి(డూప్లికేట్) 7 లక్షలు ఉన్నట్టు తమ సర్వేలో తేలిందని ఈసీ తెలిపింది. మరికొద్ది నెలల్లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అక్కడ ఈసీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) చేపట్టిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న ఈసీ అధికారులు, 52 లక్షలకు పైగా ఓటర్ల పేర్లను ఓటర్ జాబితా నుంచి తొలగించారు. ముసాయిదా ఓటరు జాబితాను ఆగస్టు 1న, తుది ఓటర్ జాబితాను సెప్టెంబర్ 30కల్లా విడుదల చేస్తామని ఈసీ పేర్కొన్నది. ప్రస్తుతం చేపట్టిన ‘సర్’పై బీహార్లో ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూఅర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారంటూ ఆరోపించాయి.