Watch: రైలు నుంచి వేలాడిన దొంగ… లోపలికి లాగి చితక్కొట్టిన ప్రయాణికులు
రైల్వే స్టేషన్ నుంచి కదులుతున్న రైలులో చోరీకి ఒక దొంగ ప్రయత్నించాడు. రైలు బోగి కిటికీ నుంచి చేతిని లోపలికి పెట్టి సెల్ ఫోన్ను లాక్కోబోయాడు. గమనించిన ప్రయాణికులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ దొంగ చేతిని, అతడు ధరించిన టీ షర్టును గట్టిగా పట్టుకున్నారు.
పాట్నా: రైళ్లలో దొంగతనాలకు పాల్పడే ఒక దొంగ రైలు నుంచి ప్రమాదకరంగా వేలాడాడు. ప్రయాణికులు అతడ్ని లోపలికి లాగి చితక్కొట్టారు. బీహార్లోని భాగల్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జమాల్పూర్-సాహిబ్గంజ్ ప్యాసింజర్ రైలు లైలాఖ్, ఘోఘా స్టేషన్ల మధ్య ప్రయాణిస్తుండగా ఈ సంఘటన జరిగింది. రైల్వే స్టేషన్ నుంచి కదులుతున్న రైలులో చోరీకి ఒక దొంగ ప్రయత్నించాడు. రైలు బోగి కిటికీ నుంచి చేతిని లోపలికి పెట్టి సెల్ ఫోన్ను లాక్కోబోయాడు.
అయితే గమనించిన ప్రయాణికులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ దొంగ చేతిని, అతడు ధరించిన టీ షర్టును గట్టిగా పట్టుకున్నారు. దీంతో ఆ దొంగ రైలు బోగి కిటికీ బయట వైపు ప్రమాదకరంగా కొంతసేపు వేలాడాడు. తన ప్రాణాలు కాపాడాలంటూ ప్రాధేయపడ్డాడు. చివరకు ప్రయాణికులు ఆ దొంగను రైలు బోగిలోకి లాగారు. అనంతరం అతడ్ని చితకబాదారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నెల 14న బీహార్లోని బెగుసరాయ్ జిల్లాలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది.
https://twitter.com/ndtvindia/status/1575417405677137922?s=20&t=8qRu3Mz2hrEfKHgqxqpPDA
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

