పాట్నా, జూలై 11: నకిలీ పత్రాలతో ఉద్యోగాలు సంపాదించిన 3,035 మంది ప్రభుత్వ స్కూలు టీచర్లను బీహార్ విద్యా శాఖ శనివారం బర్తరఫ్ చేసింది. కొన్నేండ్లుగా వీరికి జీతాలుగా చెల్లించిన దాదాపు రూ. 1,400 కోట్లను వడ్డీతో సహా తిరిగి రాబట్టాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
2006, 2015 మధ్య స్థానిక సంస్థల ద్వారా జరిగిన ఉపాధ్యాయుల నియామకాలలో భారీ అక్రమాలు జరిగినట్లు సమగ్ర విచారణలో తేలిన తర్వాత ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. ఈ నియామకాలపై దర్యాప్తు చేయాలని విజిలెన్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోను పాట్నా హైకోర్టు ఆదేశించిన తర్వాత ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.