పాట్నా: రానున్న ఉప ఎన్నికల్లో ఎన్డీయేను ఓడించిన తర్వాతే బీహార్ ప్రజలు నిజమైన విజయదశమిని జరుపుకుంటారని ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ అన్నారు. రాష్ట్రంలోని బీజేపీ-జేడీయూ ప్రభుత్వం పేదరికం, నిరుద్యోగం, నేరం, అవినీతిని మాత్రమే ఇచ్చిందని ఆయన ఆరోపించారు. బీహార్‌కు ప్రత్యేక హోదా లేదా స్పెషల్ ప్యాకేజీ అయినా రాలేదని విమర్శించారు. ఈ ప్రభుత్వం పట్ల ప్రజలు విసిగిపోయారని వ్యాఖ్యానించారు. రెండు స్థానాల్లో జరిగే ఉప ఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్థులే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.