బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మంగళవారం ఇంజినీరింగ్ కాలేజీని ప్రారంభించారు. ఈ సందర్భంగా తాను చదివే రోజులను గుర్తు తెచ్చుకున్నారు. విద్యార్థులందర్నీ నవ్వించారు. తాను ఇంజినీరింగ్ చదువుకున్న సమయంలో ఒక్క ఆడపిల్ల కూడా వుండేది కాదని గుర్తుకు తెచ్చుకున్నారు. ఎవరైనా ఒక్క ఆడపిల్ల వచ్చిందంటే… అందరమూ అటే చూసేవాళ్లం అంటూ గుర్తు తెచ్చుకుంటూ అందర్నీ నవ్వించారు.
”మేము ఇంజినీరింగ్ చదువుకునే రోజుల్లో క్లాస్లో ఒక్క ఆడపిల్లా వుండేది కాదు. చాలా ఘోరమైన పరిస్థితి వుండేది. ఎవ్వరైనా ఒక్క ఆడపిల్ల వచ్చిందంటే… ఇక అందరూ అటే చూసేవాళ్లం. అప్పటి పరిస్థితులు అలా వుండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆడపిల్లలు ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లో చదువుకుంటున్నారు. అప్పటి, ఇప్పటి పరిస్థితులు చెప్పడానికే ఈ ఉదంతం చెప్పాను” అంటూ సీఎం నితీశ్ చెప్పుకొచ్చారు.