Ex-gratia : గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలవల్ల వరి (Paddy), మామిడి (Mango) సహా పలు పంటలకు నష్టం వాటిల్లుతోంది. కొన్ని రాష్ట్రాల్లో వర్షాలతోపాటు పిడుగులు (Lightning strikes) కూడా పడ్డాయి. బీహార్లో కూడా సోమవారం పట్నా (Patna), గయా (Gaya) జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడింది.
ఈ పిడుగుల వల్ల పట్నాలో ముగ్గురు, గయాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పిడుగుపాటు మృతుల కుటుంబాలకు బీహార్ సీఎం నితీశ్ కుమార్ రూ.4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అకాల వర్షాల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.