మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 09:43:42

క‌రోనాతో బీజేపీ ఎమ్మెల్సీ మృతి

క‌రోనాతో బీజేపీ ఎమ్మెల్సీ మృతి

ప‌ట్నా: బీహార్ శాస‌న మండ‌లిలో బీజేపీ స‌భ్యుడు సునీల్ కుమార్ సింగ్ క‌రోనాతో మృతిచెందారు. క‌రోనా వైర‌స్ సోక‌డంతో ఎమ్మెల్సీ గ‌త కొన్నిరోజులుగా ప‌ట్నాలోని ఎయిమ్స్ ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయ‌న మంగ‌ళ‌వారం రాత్రి గుండెపోటు రావ‌డంతో మ‌ర‌ణించార‌ని హాస్పిట‌ల్ అధికారులు ప్ర‌క‌టించారు. 

ఎమ్మెల్సీ మ‌ర‌ణంపై బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ సంతాపం తెలిపారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. అదేవిధంగా ఉప‌ముఖ్య‌మంత్రి సుశీల్ కుమార్ మోదీ ఎమ్మెల్సీ మృతిపై సంతాపం ప్ర‌క‌టించారు.  


logo