న్యూఢిల్లీ: ఇండియన్ నర్స్ నిమిష ప్రియకు మరణ శిక్ష విధిస్తూ యెమెన్‌లోని కోర్టు ఇచ్చిన తీర్పును యెమెన్ ప్రెసిడెంట్ రషద్ అల్ అలిమి ఆమోదించలేదని ఆ దేశ ఎంబసీ సోమవారం తెలిపింది. ఈ తీర్పును ప్రెసిడెంట్ ర్యాటిఫై చేసినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వివరణ ఇచ్చింది.
ఈ కేసును హౌతీ మిలీషియా పర్యవేక్షించిందని, అందువల్ల ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ చైర్మన్ రషద్ అల్ అలిమి ఈ జడ్జిమెంట్‌ను ర్యాటిఫై చేయలేదని ఎంబసీ వెల్లడించింది. నిమిష ప్రియ కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందినవారు. ఆమె 2017లో ఓ యెమెన్ పౌరుడిని హత్య చేసినట్లు రుజువైంది. ఆమె ప్రస్తుతం యెమెన్ రాజధాని సనాలోని ఓ జైలులో ఉన్నారు.