protest outside Canadian mission | ఢిల్లీలోని కెనడా ఎంబసీ వద్ద భారీ నిరసన.. బారికేడ్లు పైకెక్కిన నిరసనకారులు
protest outside Canadian mission | దేశ రాజధాని ఢిల్లీలోని కెనడా రాయబార కార్యాలయం వద్ద హిందువులు, సిక్కులు ఆదివారం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. కెనడాలోని బ్రాంప్టన్‌లో హిందూ దేవాలయంపై ఖలిస్థాన్ అనుకూల గుంపు దాడిపై నిరసన వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని కెనడా రాయబార కార్యాలయం వద్ద హిందువులు, సిక్కులు ఆదివారం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. (protest outside Canadian mission) కెనడాలోని బ్రాంప్టన్‌లో హిందూ దేవాలయంపై ఖలిస్థాన్ అనుకూల గుంపు దాడిపై నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చాణక్యపురిలోని కెనడా హైకమిషన్ వద్ద భద్రతను పెంచారు. పోలీసులు, భద్రతా సిబ్బందిని పెద్ద సంఖ్యలో మోహరించారు. కెనడియన్ ఎంబసీ వద్ద పలు వరుసల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు.
కాగా, నిరసనకు పిలుపునిచ్చిన హిందూ, సిక్కు గ్లోబల్ ఫోరమ్ కార్యకర్తలు కొన్ని బారికేడ్లను పడేశారు. మరికొన్నింటిపైకి ఎక్కారు. ‘హిందువులు, సిక్కులు ఐక్యంగా ఉన్నారు, కెనడాలోని దేవాలయాలను అవమానిస్తే భారతీయులు సహించరు’ అని రాసి ఉన్న ప్లకార్డులు, జాతీయ జెండాలను ప్రదర్శించారు. భారత్‌కు అనుకూలంగా, కెనడాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు నిరసనకారులు మరింత ముందుకు రాకుండా పోలీసులు, భద్రతా సిబ్బంది రక్షణగా నిలిచి వారిని అడ్డుకున్నారు.
#WATCH | Delhi: People of the Hindu Sikh Global Forum on their way to the High Commission of Canada, Chanakyapuri, to protest against the attack on a Hindu Temple in Canada, were stopped at Teen Murti Marg by Police. pic.twitter.com/ONaXu46gJi
— ANI (@ANI) November 10, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

