Rope ways : పవిత్ర అమర్నాథ్ గుహ (Amarnath Cave) కు వెళ్లే మార్గం సహా మొత్తం మూడుచోట్ల రోప్‌వేల (Rope ways) ను నిర్మించడానికి సమగ్ర పథక నివేదిక (DPR) రూపకల్పన కోసం బిడ్లను ఆహ్వానించినట్లు జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) ప్రభుత్వం వెల్లడించింది.
బాల్తాల్ (Baltal) నుంచి 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహ వరకు 11.60 కిలోమీటర్ల మేర ఓ రోప్‌వేతోపాటు బడ్గాం, రామ్‌బన్ జిల్లాల్లో నిర్మించాల్సిన రెండు రోప్‌వేలు ఈ జాబితాలో ఉన్నాయి. శంకరాచార్య ఆలయం వద్ద రోప్ వే నిర్మాణ ప్రక్రియ డీపీఆర్ దశలో ఉందని ప్రభుత్వం పేర్కొంది.