సాగు సమస్యలపై రైతు నేతలతో భూపీందర్ హుడా భేటీ
వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై బీకేయూ నేత రాకేష తికాయత్ సహా పలువురు రైతు సంఘాల నేతలతో కాంగ్రెస్ సీనియర్ నేత, హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా శనివారం సంప్రదింపులు జరిపారు.
న్యూఢిల్లీ : వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై బీకేయూ నేత రాకేష తికాయత్ సహా పలువురు రైతు సంఘాల నేతలతో కాంగ్రెస్ సీనియర్ నేత, హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా శనివారం సంప్రదింపులు జరిపారు.
చింతన శిబిరం నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన రైతు, వ్యవసాయ కమిటీకి భూపీందర్ హుడా సారధ్యం వహిస్తున్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రైతు నేతలతో తాను చర్చించానని, వాటి పరిష్కారానికి సూచనలను తెలుసుకున్నానని భూపీందర్ హుడా తెలిపారు. తాము సాగు సమస్యలపై చింతన శిబిరం నిర్వహిస్తామని, దీనికి సంబంధించిన ముసాయిదా పత్రం రూపొందించి దానిపై చర్చలు జరుపుతామని కాంగ్రెస్ నేత వెల్లడించారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది పాటు రైతుల ఆందోళన ఫలితంగా నల్ల చట్టాలను కేంద్రం వెనక్కితీసుకుందని ఆయన గుర్తుచేశారు. ఎంఎస్పీ కంటే తక్కువ ధరకు వ్యవసాయ ఉత్పత్తులను ఎవరైనా కొంటే వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎగుమతి-దిగుమతి విధానం రైతుకు హాని కలిగించేలా ఉండకూడదనేది తమ మరో ప్రధాన డిమాండని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
RS Praveen Kumar | రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్‌గా ఆర్పీఎఫ్..! ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం
KCR | ఇదిగో కేసీఆర్ ముందుచూపు.. కరువులోనూ నీళ్లు పారేలా ప్రణాళిక
Singareni | జై కొట్టిన సింగరేణి.. జాతరను తలపించిన నల్లనేల
Harish rao | పాలమూరుకు పట్టిన గ్రహణం రేవంత్.. హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

