రాయ్పూర్: ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, బీజేపీపై మరోసారి మండిపడ్డారు. రాముడిని ‘రాంబో’గా, హనుమంతుడిని ‘కోపానికి చిహ్నం’ గా ఆ పార్టీ మార్చుతున్నదని విమర్శించారు. సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘రాముడిని మర్యాద పురుషోత్తముడిగా, ఆదర్శవంతుడిగా మనం విశ్వసిస్తాం. ఎల్లప్పుడూ రామరాజ్యం గురించి ఆలోచిస్తాం. కానీ గత కొన్నేళ్లుగా, రాముడిని రాంబోగా చూపించడానికి ప్రయత్నాలు జరిగాయి. రాముడితోపాటు హనుమంతుడ్ని కూడా కోపంగా చిత్రీకరిస్తున్నారు. ఇది సమాజానికి మంచిది కాదు’ అని అన్నారు.
కాగా, శ్రీరామ నవమి సందర్భంగా ఏడు రాష్ట్రాల్లో జరిగిన హింసాత్మక ఘటనలకు బీజేపీనే కారణమని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఇటీవల ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు దమ్ము, ధైర్యం ఉంటే ఈ హింసాత్మక ఘటనలపై ఒక కమిటీతో దర్యాప్తు జరిపించాలని సవాల్ చేశారు. అప్పుడు వాస్తవం ఏమిటో తెలుస్తుందని, భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కావని అన్నారు. రాజస్థాన్ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో హింసను రాజేసి లబ్ధి పొందాలని బీజేపీ చూస్తున్నదని మండిపడ్డారు.
#Watch | "Lord Ram, a symbol of dignity and calmness, in the past few years has been portrayed as a warrior, Rambo," says Bhupesh Baghel, CM Chhattisgarh pic.twitter.com/v8rkhuWqKB
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 9, 2022