భోపాల్, ఫిబ్రవరి 13: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. రాజధాని భోపాల్లో 11వ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. బాలికను కొందరు వ్యక్తులు భోపాల్లో అపహరించి నాలుగు వేర్వేరు వాహనాల్లో సామూహిక లైంగికదాడి చేశారు. ఆ దృశ్యాలను వీడి యో తీసి, దానిని వైరల్ చేస్తామంటూ బెదిరించి ఆమె నుంచి రూ. 40 వేలు వసూలు చేశారు.
తమతో లైంగిక సంబంధాన్ని కొనసాగించాలంటూ బాధితురాలిని బలవంతం చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఔసఫ్ అలీ ఖాన్, జిమ్ నిర్వాహకుడు మాజ్ ఖాన్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించి ఏసీపీ అంకితా ఖటార్కర్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్టు పోలీస్ కమిషనర్ తెలిపారు. అలాగే ఈ కేసులో ఒక హెడ్ కానిస్టేబుల్ని సస్పెండ్ చేసినట్టు చెప్పారు.