లక్నో, జూన్ 29: తనపై జరిగిన దాడిన యూపీ ప్రభుత్వ వైఫల్యమని, దీనికి బాధ్యత వహించి సీఎం యోగీ ఆదిత్యనాథ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన సుదీర్ఘమైన ట్వీట్ చేశారు.
గతంలో దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, నకిలీ ఎన్కౌంటర్లు జరిగేవని.. ఇప్పుడు విపక్ష నాయకులను నిర్మూలించడానికి నేరుగా తూటాలను ఉపయోగిస్తున్నారని ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగం ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు.